Thursday, April 17, 2008

chiru2

చిరంజీవి పార్టీ సందేహమేనా?మంగళవారం, ఏప్రిల్ 15 2008, 17:25 Hrs (IST)  తెలుగులో ఉచిత న్యూస్ లెటర్ కోసం

చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టకపోవచ్చన్న వదంతులు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనేక విధాలుగా చిరంజీవిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆయనను రాజకీయాల్లోకి రాకుండా చూస్తోందన్న అభిప్రాయం సినీ రంగ ప్రముఖుల్లో ఉంది.చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అనేక అవకతవకలు ఉన్న విషయాన్ని అధికారులు వైఎస్ కు నివేదించారట. అదీగాక చిరంజీవి ఆస్తులకు సంబంధించిన గుప్త సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని సమాచారం. కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల నుంచి ఈ సమాచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పాలకులు తెప్పించుకున్నట్టు తెలిసింది.అల్లు అరవింద్ వంటి కుటుంబ సభ్యుల వత్తిడికి తలొగ్గిన చిరంజీవి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారే కానీ ఆయనకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదని చెబుతున్నారు. చిరంజీవికి రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బు పాడుచేసుకోవడం ఇష్టం లేదంటున్నారు. చిరంజీవి పార్టీపై మీడియాలో వార్తా కథనాలు బాగా తగ్గిపోయాయి.నెలరోజుల్లో చిరంజీవి ముందుకు రానట్టయితే ఆయన రాజకీయాల్లోకి శాశ్వతంగా రాకపోవచ్చన్ని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Tags: chiranjeevi, actor chiranjeevi, chiru political party, chiru blood bank, chiru

No comments: